ప్రపంచవ్యాప్తంగా నిరూపిత సత్

<!-- /* Font Definitions */ @font-face {font-family:Gautami; panose-1:2 0 5 0 0 0 0 0 0 0; mso-font-charset:1; mso-generic-font-family:auto; mso-font-pitch:variable; mso-font-signature:2097152 0 0 0 0 0;} @font-face {font-family:"Cambria Math"; panose-1:2 4 5 3 5 4 6 3 2 4; mso-font-charset:0; mso-generic-font-family:roman; mso-font-pitch:variable; mso-font-signature:-1610611985 1107304683 0 0 159 0;} @font-face {font-family:Calibri; panose-1:2 15 5 2 2 2 4 3 2 4; mso-font-charset:0; mso-generic-font-family:swiss; mso-font-pitch:variable; mso-font-signature:-1610611985 1073750139 0 0 159 0;} /* Style Definitions */ p.MsoNormal, li.MsoNormal, div.MsoNormal {mso-style-unhide:no; mso-style-qformat:yes; mso-style-parent:""; margin-top:0in; margin-right:0in; margin-bottom:0in; margin-left:.25in; margin-bottom:.0001pt; text-align:justify; line-height:150%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:Calibri; mso-fareast-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Gautami; mso-bidi-theme-font:minor-bidi; mso-bidi-language:AR-SA;} .MsoChpDefault {mso-style-type:export-only; mso-default-props:yes; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:Calibri; mso-fareast-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Gautami; mso-bidi-theme-font:minor-bidi; mso-bidi-language:AR-SA;} .MsoPapDefault {mso-style-type:export-only; margin-left:.25in; text-align:justify; line-height:150%;} @page Section1 {size:8.5in 11.0in; margin:1.0in 1.0in 1.0in 1.0in; mso-header-margin:.5in; mso-footer-margin:.5in; mso-paper-source:0;} div.Section1 {page:Section1;} -->

2004 లో, పీవీజీ నిష్ర్కమించే నాటికి, నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకీ, నెం.5 వర్గపు అస్తిత్వం తెలుసు. అయితే దానిబలం ఎంతో, విస్తారత ఎంతో తెలియదు. ఎక్కడనుండి పనిచేస్తుంటారో, ఎవరెవరు పనిచేస్తున్నారో, ఎలా పనిచేస్తున్నారో తెలియదు. పీవీజీ ప్రధానిగా ఉండగా 1992 మధ్య నుండి, తమకు ఎదురుదెబ్బలు తగలటం ప్రారంభించాయి. ముఖ్యంగా…… డిసెంబరు 6,1992 లో, ‘అమోధ్యలోని బాబ్రీమసీదు కూలగొట్టటం’ అన్న పునాదిపైన, తాము రచించుకుని అమలు చేసిన, కుట్రప్రధానాంశం, అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. సరికదా, ఆ తర్వాత ప్రధానిగా పీవీజీ ’తనకు నాలుగేళ్ళ మారిటోరియం ఇవ్వాలనీ, అప్పటిదాకా దేశపు అభివృద్ధే తన ప్రధానలక్ష్యమనీ, ఇందుకెవరూ ఆటంకాలు కల్పించకూడదని, అందుకే నాలుగేళ్ళ మారిటోరియం పాటించాలని’ ప్రకటిస్తే….. నిస్సహాయంగానో, మరోదారి లేకనో, ప్రతిపక్షాలన్నీ పెద్దగా ప్రతిఘటన లేకుండానే నాలుగేళ్ళు ఊరుకోవాల్సి వచ్చింది.

 

        రాజకీయ ఎత్తుగడలతో ఆనాడు పీవీజీని ఇరుకున బెట్టప్రయత్నించారు గానీ, ఫలించింది తక్కువే. మొత్తానికి నాలుగేళ్ళ మారిటోరియం మాత్రం అమలయ్యింది. దాంతో, తరువాతి కాలంలో సీతారాం కేసరి వంటి పప్పెట్స్ ని AICC అధ్యక్షుడిగా చేసి రిమోట్ తో అధికారం చెలాయించిన సోనియాగాంధీ, పీవీజీకి తదుపరి టిక్కెట్టు కూడా ఇవ్వలేదు. ఆనక, ’ఇక ఈ పప్పెట్స్ కూడా ఎందుకులే’ అనుకుని, సీతారాం కేసరిల వంటి వాళ్ళని వదిలేసి, ఇటలీ గాంధీ తానే AICC ప్రెసిడెంట్ అయిపోయింది.  

 

        అటువంటి సోనియాగాంధీ కి, నకిలీ కణిక వ్యవస్థనీ, నెం.10 వర్గాన్నీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు నీ, తననీ  [అప్పటికి ఇంతగా బహిరంగం గాకపోయినా, లోతట్టున, పైకి ప్రకటించుకో లేకుండా] ఎదురుదెబ్బతీస్తున్న నెం.5 వర్గాన్ని తయారుచేసినందుకు పీవీజీ మీద పీకల దాకా కోపం ఉంది. ఆ విషయం పీవీజీకి కూడా తెలుసు.  

 

        ఎంత కోపం లేకపోతే…..కారణాలు ఏమైనా కానివ్వండి, నెలక్రితం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. పేరిట దేవుడి గడప, కడప జిల్లాకు పేరుమార్చడానికి ఆఘమేఘాల మీద రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కిమ్మనకుండా ఊరుకుంది. వై.యస్. ఒకరాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసాడు. గతంలో అయితే ఇందిరాగాంధీని వ్యతిరేకించిన రెడ్దికాంగ్రెస్ లోకి పోయి తిరిగి వచ్చాడు.

 

        మరి పీవీజీ రాష్ట్రానికి మంత్రి, ముఖ్యమంత్రి గానే కాదు, కేంద్రంలోనూ, కీలక శాఖలు నిర్వహించాడు. ప్రధానమంత్రిగా పని చేశాడు. ఆజన్మాంతము కాంగ్రెస్ కండువా మార్చలేదు. మరి ఆయన పేరుని జిల్లాకి కాదు గదా, ఒక్క వీధికీ పెట్టలేదేం? ఢిల్లీలో రిజర్వేషన్ల కుల సంఘర్షణల్లో ఆత్మాహుతికి పాల్పడ్డ [తర్వాత బ్రతికి బయటపడ్డాడులెండి] అప్పటి విద్యార్ధి, రాజీవ్ గోస్వామి పేరిట కూడా, ఓ విశాలమైన రహదారి ఉంటుంది గానీ, కంచుకాగడా పెట్టి వెదికి చూసినా ఈ తెలుగు మేధావి పేరు ఎక్కడా కనబడదు. [‘భగవంతుడి దృష్టిలో మన పేరు ఉంటే చాలు, భాగ్యనగరంలోనో, హస్తినాపురంలోనో ఉన్నా లేకున్నా పట్టింపు లేదు’ అనుకున్నాడు కాబట్టి పీవీజీకి ఇవన్నీ పట్టలేదు.]

 

కాబట్టి – ప్రపంచవ్యాప్తంగా, సుదీర్ఘకాలంగా, బలపడిన నకిలీ కణిక వ్యవస్థనీ, నెం.10 వర్గాన్ని బహిరంగ పరచటమూ, వాళ్ళ చేత చేసిన కర్మను అనుభవింపచేయటం [సువర్ణముఖి] అనే ఈ ’పని’ చాలా క్లిష్టమైనది. ఎంతో సహనం, మేధస్సు, శ్రమతో కూడుకున్నది. ఎందుకంటే, ‘డబ్బుతోనూ, గూఢచర్యంతోనూ ఏమైనా చేయవచ్చనుకునే’ నకిలీ కణికవ్యవస్థ, నెం.10 వర్గమూ, ప్రపంచవ్యాప్తంగా, ప్రజలలో కూడా, ఎక్కువమందికి, ‘డబ్బుతో ఏమైనా చేయవచ్చనే’ దృక్పధాన్ని ఇంకించింది. డబ్బుకంటే మానవీయ విలువలే విలువైనవనే సత్యాన్ని, ఇప్పుడు ప్రజల్లో తిరిగి ఆవిష్కరించాలంటే, అది ఖచ్చితంగా సహనం, మేధస్సు, శ్రమలతో కూడుకున్నదే!

 

        అలాంటి పనిని చేయటానికి ఒక్క వ్యక్తి చాలడు. ప్రారంభం ఒక్క వ్యక్తితో కావచ్చు. కానీ ప్రారంభం, ముగింపులు, మొత్తంగా ’పని’ని నిర్వహించటంతో పోలిస్తే చిన్నవి, తేలికైనవి. కాబట్టి ఇంతపనిని నిర్వహించాలంటే ఒక వ్యవస్థ తప్పని సరిగా అవసరం. అందుచేతే, ప్రపంచవ్యాప్తంగా, ఆయా దేశాలలో తమ తమ దేశాల పట్ల భక్తి, గౌరవం, ప్రేమా ఉన్నవారినీ, మానవత్వం పట్ల నిబద్దత, నిజాయితీ గలవారినీ కలుపుకుని. నెం.5 వర్గాన్ని సమీకరించగలిగాడాయన. గతటపాల్లో నేను వివరించిన అంశాలను బహిరంగపరిచింది ఈ వర్గమే! ఇందులో ఎందరో ధీరులు తమ వ్యక్తిగత వివరాలేవీ బయటికి తెలియకుండానే పనిచేస్తున్నారు. అలాంటి వ్యవస్థలో, అజ్ఞాతంగా పనిచేస్తున్న ఎందరిలాగానో, తానూ మౌనంగా ఉండిపోయాడాయన. అంతే మౌనంగా ఈ ప్రపంచం నుండి మహాభినిష్ర్కమణం చేసాడు.

 

        నిజానికి ఈ పద్దతి నకిలీ కణిక వ్యవస్థ అనుసరించి, అమలు జరిపినదే. నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ చెందిన ఏజంట్లు తము బయటికి కనబడకుండానే పనిచేస్తారు. పైకి వివిధవృత్తుల్లో ఉన్నట్లుంటారు. అందులో కొందరు మాత్రమే వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఉంటారు. అది రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, సినిమా – ఇత్యాది రంగాలు అవుతాయి. ఇలా ప్రముఖులుగా కాకుండా కూడా, ఎంతోమంది పనిచేస్తుంటారు. వాళ్ళకు కావలసింది డబ్బు, సౌఖ్యం అంతే! [సిఐఏ తన ఏజంట్లను ఏఏ రంగాలలో ఎలా నియమించుకుంటుందో, ఎలా పనిచేయించుకుంటుందో, 1993 – 94 లలో ఈనాడు పేపరులోనే వచ్చింది.] వీరిలో కొందరికైతే తాము నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ అనుకూలంగా పనిచేస్తున్నామని కూడా తెలియదు. మారిన కాలంలో, తమ దృక్పధం తమకి సక్సెస్ తెచ్చిపెడుతుందనుకుంటారు. ఇక, వివిధరంగాల్లో ప్రముఖులుగా పేరుప్రఖ్యాతులు పొందిన వారిని సైతం, నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ ఏజంట్లుగా ఎవరూ గుర్తించలేరు. అసలు అటువంటి వ్యవస్థ అస్థిత్వం తెలిస్తే గదా గుర్తించేందుకు? వాళ్ళదృష్టిలో మొత్తంగా గాడ్ ఫాదర్ లే కన్పిస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా గాకపోయినా, మనదేశం వరకూ అయినా, అటువంటి వ్యవస్థ ఒకటి పనిచేస్తుందని అనుభవంలోకి వచ్చిన, భారతదేశంలోని ఒకప్పటి కేంద్రప్రభుత్వాలు, ప్రయత్నించీ, పోరాడీ కూడా, నిరూపించలేకపోయాయి. ఎందుకంటే అసలు కీలక వ్యక్తులు ఎవరెవరో, ఎక్కడెక్కడ నుండి, ఎలా పనిచేస్తున్నారో తెలియలేదు కనుక!

 

        అంతెందుకు? నకిలీ కణిక వ్యవస్థలోనూ, నెం.10 వర్గంలోనూ కీలక వ్యక్తియైన రామోజీరావు, తానో స్థానిక పత్రికాధిపతిని అన్న చిన్నముసుగు వేసుకుని, జాతీయపత్రికలైన హిందూ తాలూకూ ఎన్.రామ్ లనీ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ తాలూకూ గోయంకాలనీ ప్రొజెక్ట్ చేసాడు గానీ, తనని మాత్రం ప్రొజెక్ట్ చేసుకోలేదు. రామోజీరావుకి అత్యంత ముఖ్యమైన మరో ఏజంటు, సోనియాగాంధీ, సాక్షాత్తూ ప్రధాని ఇంటనే ’ఇల్లాలు’ ముసుగు వేసుకుని తెరచాటునే ఉండింది. రామోజీరావే నకిలీకణిక వ్యవస్థలోని కీలక వ్యక్తి అని ఎందుకు అన్నానంటే – తీగ అతడే కాబట్టి! ఆ తీగ లాగితే డొంకంతా కదిలింది కాబట్టి! అతడిమీద ఫిర్యాదుతో మొదలైన ఈ ‘లాగుడు’తో మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెనుమార్పులు వచ్చాయి కాబట్టి! చాలామంది ఆ కోణంలో చూడకుండా, మమ్మల్నివేధించాడు కాబట్టి, అతడిని ప్రొజెక్ట్ చేస్తున్నానని అనుకుంటారు. అలా నేను ప్రొజెక్ట్ చేసినంత మాత్రాన అతడు ‘కీలకవ్యక్తి’ అయిపోడు. అంతేకాదు నేనిచ్చిన ఫిర్యాదు నలుగురు వ్యక్తులు మీద ఉంది. వారు విపిసింగ్, కరుణానిధి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, రామోజీరావులు. ఫిర్యాదు ఇచ్చిన తరువాత అప్పటి హోంమంత్రి ఎస్.బి.చవాన్ "పత్రికాధిపతులలో సిఐఏ ఏజంట్లు ఉన్నారని అన్నాడు గానీ, మాజీ ప్రధానులలో గానీ, ముఖ్యమంత్రులలో గానీ, మాజీ ముఖ్యమంత్రులలో గానీ సిఐఏ ఏజంట్లున్నారు అని అనలేదు. అంతేకాదు అప్పుడు మొత్తంగా కదలికలు హైద్రాబాదు చుట్టూనే తిరిగాయి.

 

ఏదేమైనా, వారి ఏజంట్లలెవరూ బహిరంగపడరు. అదేపద్దతిని నెం.5 వర్గమూ ఆచరిస్తోంది, అమలుపరుస్తోంది. ఇందులో పనిచేసే వ్యక్తులు కూడా, ప్రచ్చన్నంగా, వివిధ రంగాల్లో, వివిధ వృత్తుల్లో ఉన్నారు. ఎవరు ఎక్కడి నుండి ఎలా పనిచేస్తున్నారో తెలియదు. తెలిసి ఉంటే నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, ఆయా వ్యక్తుల మీద తమ గురిపెడుతుంది. శారీరకంగా, మానసికంగా ఒత్తిడి చేస్తుంది. భౌతిక దాడులైనా చేస్తుంది. మానసిక యుద్దతంత్రాల్ని అమలు చేస్తుంది. వాళ్ళ కుటుంబ బంధాల మీదా గురిపెడుతుంది. కాబట్టే, ఈ విధంగా ‘ప్రచ్ఛన్నంగా పనిచేయటం’ అన్న Concept ని నెం.5 వర్గం చేతుల్లోకి తీసుకుంది.

 

        ఈ Concept నే, ఇటీవల కొన్ని సినిమాలు [పోకిరి, హోమం వంటివి] లో పరిచయం చేసారు. నిఘాసంస్థల్లో పనిచేసే వారి మీద సైతం, ఇలాంటి శారీరక మానసిక యుద్దతంత్రాలని, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, ఆయాదేశాలలో అధికారంలో ఉన్న తమ ఏజంట్ల చేత ప్రయోగింప చేస్తుంది. కాబట్టి ఈ విధంగా పనిచేయటం! ఇదంతా ఎప్పుడైనా ప్రజలకి తెలియజెప్పబడితే……తమ గురించి ఎవరు ప్రజలకి తెలియచెబుతారో, వారికి ’పిచ్చి’ అనో, మానసిక రుగ్మత అనో, మెదడులో కెమికల్ గడబిడ అనో, XYZ సిండ్రోమ్ అనో, లేకపోతే ABCD డిజార్డర్ అనో అనాలన్న ముందస్తు ప్రచారాన్ని, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, తమ ఏజంట్ల చేత సినిమాలుగా నిర్మించింది. మీడియాలో చర్చలూ, ప్రచారాలూ చేసింది. ఇవన్నీ నిజమే అనుకుని ఒక వ్యక్తిని స్క్రిజోఫినియా అనగలరేమో  గానీ, సంఘటనాత్మకంగా ఉన్న విషయాలని ఎలా దాస్తారబ్బా?

 

నాకు పేరు గుర్తులేదు కానీ, బాలీవుడ్ లో, బిపాసాబసు, జాన్ అబ్రహంలతో ఒక సినిమా వచ్చింది. అందులో కథానాయిక యాంటి టెర్రరిజం గ్రూప్ ని ఒకదాన్ని ఊహిస్తుంది. దానికి నాయకుడిగా హీరోని ఊహించి, అతణ్ణి ప్రేమిస్తుంది. నిజానికి అలాంటి గ్రూప్ ఏదీ లేకపోవటం, నాయికని ప్రేమించిన మరో యువకుడు తన ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ లాంటివేవో చేయించుకుని నాయికకి మనశ్శాంతి నివ్వటం, ఆమెకి మద్దతుగా నిలబడి ఆమెని బాగుచేసుకోవటం….. ఆ సినిమా ఇతివృత్తం. ఇక మానసిక రోగాల మీద కావలసిన్ని సినిమాలు వచ్చాయి. అంటే నెం.5 వర్గానికి, నెం.10 వర్గం ’ఎప్పుడైనా ఇదంతా మీరు బయటపెడితే, బయటపెట్టిన వాళ్ళని, మేమిలా, మీడియా మొత్తం చేత స్టాంపు కొట్టి, వాళ్ళు చెప్పిన దాన్నంతా చెత్తబుట్టలో వేయిస్తాం’ అన్న సవాల్ విసిరిందన్న మాట!

 

        ఈ విధంగా నెం.10, నెం.5 వర్గాలమధ్య చాలా సంభాషణే నడిచింది. సినిమాలు రూపేణా మాత్రమే కాదు, రాజకీయపార్టీలు, రాజకీయవేత్తల ప్రవర్తనలతో సహా! అందులో భాగమే ఆత్మహత్యా సదృశ్య Assignments! కాబట్టే నెం.5 వర్గంలో ఎవరెవరు ఉన్నారో, ఎక్కడెక్కడి నుండి పనిచేస్తున్నారో తెలుసుకోవాలన్న అన్వేషణని నెం.10 వర్గం అవిశ్రాంతంగా చేసింది, చేస్తోంది. ఆ అన్వేషణలోనే, ‘కన్నా? కాలా?’ స్ట్రాటజీకి గురై, తమని తామే బహిర్గతం చేసుకుంటోంది.

 

        ఇదీ నడుస్తున్న ’మెదళ్ళతో యుద్ధం!’          

 

మరిన్ని  విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

              సర్వేజనా సుఖినో భవంతు!

Replies 1 to 1 of 1 Descending
Hitched Hiker
Hitched Hiker
from Mumbai
13 years ago

This needs to be cleaned up.

 


LockSign in to reply to this thread